- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనం సృష్టించిన SRH.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన రికార్డు క్రియట్ చేసింది. ఇంతకాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న అత్యధిక పరుగుల(263) రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే చెదిరిపోని రికార్డు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన SRH బ్యాటర్లు మొదటి నుంచి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్దారు. హెడ్(62), అభిషేక్ శర్మ(63), హెన్రిచ్ క్లాసేన్(80), మార్కరమ్(42) ఇలా ఒచ్చినోళ్లు వచ్చినట్లు చితకబాదారు. మొత్తంగా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబై ఎదుట 278 పరుగుల భారీ లక్ష్యం ఉంది.
ముంబై బౌలింగ్..
ముంబై బౌలర్లలో కెవెనా మఫాకా 66 పరుగులు, హార్దిక్ పాండ్యా (సి) 46, జస్ప్రీత్ బుమ్రా 36, గెరాల్డ్ కోయట్‌జీ 57 సమర్పించగా.. కేవలం రెండు ఓవర్లు వేసిన పియూష్ చావ్లా 34, షమ్స్ ములానీ 33 పరుగులు సమర్పించుకున్నారు. అలాగే పాండ్యా, కోయట్‌జీ, చావ్లా లలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో కోయట్ జీ అత్యధికంగా 6 వైడ్లు వేయగా.. మొత్తం 12 ఎక్స్ట్రా రన్స్ వచ్చాయి.