- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాండ్యాకు షాక్.. ముంబై కెప్టెన్‌గా తిలక్ వర్మ..!
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022, 2023 సీజన్‌లలో గుజరాత్ జట్టు కెప్టెన్ హర్ధీక్ పాండ్యను ముంబై జట్టు భారీ మొత్తానికి కొనుగోలు చేసి.. ముంబై జట్టు కెప్టెన్ ను చేసింది. సీనియర్ ప్లేయర్.. ఐదు ఐపీఎల్ ట్రోఫీలను సాధించిపెట్టిన రోహిత్ శర్మను పక్కకు పెట్టి మరి పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. దీంతో అతనిపై ఈ సీజన్ భారీ ఆశలు ఉన్నాయి. ఎన్నో కప్పు గెలిపించిన రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో ముంబై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు మ్యాచులు ఆడిన ముంబై జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ముంబై కెప్టెన్ ను మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరిగి రోహిత్ శర్మ కెప్టెన్ కాకుండా.. అతనికి ఇష్టమైన యువ ప్లేయర్, తిలక్ వర్మకు బాధ్యతలు అప్పగించే పనిలో పడినట్లు తెలుస్తుంది. మరోపక్క తనపై జరుగుతున్న ట్రోల్స్ కారణంగా పాండ్యానే స్వతహగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. యువ ప్లేయర్ తిలక్ వర్మకు కెప్టెన్సీ భాద్యతలను ఇస్తే.. రోహిత్ శర్మ పూర్తిగా సహకరిస్తాడని.. అతను అయితేనే జట్టును మ్యానేజ్ చేయగలడనే సోషల్ మీడియా వేదికగా ముంబై ప్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే ముంబై యాజమాన్యం స్పందించాల్సి ఉంది.