- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్జరీ కోసం త్వరలో లండన్‌కు ధోనీ?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. బెంగళూరు చేతిలో ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ సీజన్ అతనికి చివరదంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బెంగళూరు మ్యాచ్ అనంతరం అతను వీడ్కోలు పలుకుతాడని అంతా భావించినప్పటికీ అతను ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నయ్ ఫ్రాంచైజీ వర్గాలు స్పందించాయి. ‘తాను వైదొలుగుతున్నట్టు ధోనీ సీఎస్కేలో ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని మాత్రమే మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అతనితో మాట్లాడేందుకు వేచి చూస్తున్నాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి. కాగా, బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన వెంటనే ధోనీ రాంచీకి వెళ్లాడు. కాలు గాయానికి సర్జరీ కోసం ధోనీ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి ఆరు నెలలు పట్టొచ్చని, ఆ తర్వాతే అతను తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.