- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL2024: సొంత మైదానంలో SRH జోరు కొనసాగేనా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB
దిశ, వెబ్‌డెస్: ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదేవిధంగా ఆ జట్టులో విరాట్ కోహ్లీ చక్కని ఫాంలో ఉన్నాడు. భారీ స్కోర్లు సాధిస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా మరో బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా చివర్లో వేగంగా పరుగులు చేస్తూ జట్టు భారీ స్కోర్లు సాధించడంలో కీలకంగా మారాడు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే.. ప్రత్యర్థుల ముందు తేలిపోతున్నారు. ఎంత లక్ష్యమైనా బౌలింగ్‌లో నాణ్యత లేకపోవడంతో ఆర్సీబీ వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. ఇక హోం టీం ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించి వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
జట్టులో ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాద్ అహ్మద్ అందరూ చక్కని ఫాంలో ఉన్నారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ప్రతిసారి ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోర్లను నమోదు చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. ఆరంభంలో ధారళంగా పరుగులు ఇవ్వడం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తలపడిన ఎస్ఆర్‌హెచ్ 287 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. బెంగళూరులో ఓటమికి నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌పై ప్రతికారం తీర్చుకుంటుందా.. బొక్కబోర్లా పడుతోందా వేచి చూడాల్సిందే మరి.
తుది జట్లు ఇలా..
హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(C), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.
బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (C), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్