ఐపీఎల్ 2023 ఫైనల్: చక్రం తిప్పిన జడేజా.. ఐదో టైటిల్ గెలిచిన చెన్నై

by Mahesh |   ( Updated:2023-05-30 11:58:58.0  )
ఐపీఎల్ 2023 ఫైనల్: చక్రం తిప్పిన జడేజా.. ఐదో టైటిల్ గెలిచిన చెన్నై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ కారణంగా తీవ్ర ఆసక్తిగా మారింది. వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్ మార్చడం జరిగింది. అనంతరం సోమవారం రాత్రి 7.30 కి మ్యాచ్ ప్రారంభం కాగా మొదట టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. గిల్ 39, సాహా 54, సాయి సుదర్శన్ 96, పాండ్య 21 పరుగులతో రాణించడంతో.. 214 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై.. కు మొదటి ఓవర్‌లోనే వర్షం అడ్డు తగిలింది. దీంతో మ్యాచ్ నిలిపేసిన అంపైర్లు.. దాదాపు 12 గంటల తర్వాత తిరిగి మ్యాచ్ ను ప్రారంభించారు. DLS మెథడ్ ప్రకారం.. 15 ఓవర్లకు 171 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో చెన్నై బ్యాటర్లు ప్రతి ఓవర్లో దూకుడుగా ఆడారు... గైక్వాడ్ 26, కాన్వే 47, దుబే 32, రహానే 27, రాయుడు 19 పరుగులతో రాణించడంతో.. చివరి ఓవర్లో 13 పరుగులు రావాల్సి ఉంది. దీంతో చివరి ఓవర్లో జడేజా సిక్సు, ఫోర్‌తో మేరవడంతో చెన్నై 5వ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed