IPL 2023: 'నో బాల్‌'తో బతికిపోయిన చెన్నై ఓపెనర్..

by Vinod kumar |   ( Updated:2023-05-23 14:47:23.0  )
IPL 2023: నో బాల్‌తో బతికిపోయిన చెన్నై ఓపెనర్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ నో బాల్‌ కారణంగా ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్‌ 2వ ఓవర్‌లో దర్శన్‌ నల్కండే వేసిన మూడో బంతికి రుతురాజ్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే అది నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఇక 3 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రుతురాజ్‌ 18, కాన్వే 3 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement

Next Story