ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ 9వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాగా మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ జట్టు ఇందులో గెలిచి తమ ఖాతాను తెరవాలని చూస్తుంది. అలాగే సొంత గడ్డపై మరో విజయం సాధించాలని భావిస్తుంది. అలాగే ఢిల్లీ కెప్టెన్ పంత్ ఈ రోజు జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ లో 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో ఈ మ్యాచులో పంత్ ఆటపై ఢిల్లీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మ్యాచ్ లో పంత్ ఏ విధంగా రాణిస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్


Next Story

Most Viewed