ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200+ స్కోరును చేజ్ చేసిన ముంబై

by Mahesh |   ( Updated:2023-05-10 06:35:14.0  )
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200+ స్కోరును చేజ్ చేసిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత వేగవంతమైన 200+ పరుగులను చేజ్ చేసి రికార్డు నమోదు చేసింది. మంగళవారం RCBతో జరిగిన 54వ మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 16.3 ఓవర్లలో ఛేదించింది. కాగా గతంలో ఈ రికార్డు.. ఢిల్లీ జట్టు పేరు మీద ఉంది. 2017 ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు.. 209 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ లయన్స్ పై 17.3 ఓవర్లలో చేధించి రికార్డును నమోదు చేయగా తాజాగా ఈ రికార్డును ముంబై జట్టు బ్రేక్ చేసింది.

Read More: సూర్యకుమార్ యాదవ్పై గంగూలీ ప్రశంసల జల్లు

Advertisement

Next Story