బీసీసీఐపై ఫ్రాంచైజీల ఒత్తిడి

by Shyam |
బీసీసీఐపై ఫ్రాంచైజీల ఒత్తిడి
X

దిశ, స్పోర్ట్స్: టీ-20 వరల్డ్ కప్‌పై ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత కూడా బీసీసీఐ ఇంకా ఐపీఎల్‌పై నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించట్లేదని ఫ్రాంచైజీలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ప్రారంభ తేదీని ప్రకటిస్తే సరిపోదని వెంటనే పూర్తి షెడ్యూల్, వేదికలు నిర్ణయించి అధికారికంగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నాయి.

వైరస్ నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఐపీఎల్ నిర్వహించవచ్చని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. ఐపీఎల్‌ను ఎలా నిర్వహించినా మేం ఒప్పుకుంటాం. ఖాళీ స్టేడియాల్లో జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుత సమయంలో ప్రేక్షకులు కూడా స్టేడియాలకు వచ్చే అవకాశం లేదు. అందరూ టీవీల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి, వ్యాపార ప్రకటనలకు గిరాకీ బాగానే ఉంటుంది. టోర్నీ తేదీలను త్వరగా ప్రకటిస్తే స్పాన్సర్లు కూడా సులభంగా లభిస్తారని వాడియా చెబుతున్నారు.

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించాలని కోరుతున్నాయి. మరి బీసీసీఐ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed