ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ

by Shyam |
ఐపీఎల్‌ను వాయిదా వేసిన బీసీసీఐ
X

దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. విదేశీ ఆటగాళ్ల వీసాలపై కూడా ఏప్రిల్ 15 వరకు ఆంక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఐపీఎల్ నిర్వహణకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా బీసీసీఐపై ఒత్తిడి తీసుకురావడంతో వాయిదా వేయక తప్పలేదు. ఈ మేరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు.

Tags: IPL, Coronavirus, April 15, Delhi, Kolkata, Twitter

Advertisement

Next Story