పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ ఉత్తమం: వసీం అక్రమ్

by Shyam |
పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ ఉత్తమం: వసీం అక్రమ్
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో పెద్దది, ఉత్తమమైనదని పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌ను బీసీసీఐ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నదని, ఇందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అక్రమ్ గుర్తుచేశాడు. ‘ఐపీఎల్‌లో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కూడా ఎంతో ఖర్చు చేస్తున్నాయి. దీని ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయాన్ని దేశవాళీ క్రికెట్ అభివృద్దికి ఉపయోగిస్తున్నది. అందుకే ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఐపీఎల్ ద్వారానే హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి వాళ్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలు రూ.80కోట్ల వరకు ఖర్చు చేస్తాయి. ఇది పీఎస్ఎల్ కంటే రెండింతలు ఎక్కువ. డబ్బు, అవకాశాలు వస్తుండటంతో ఐపీఎల్ కోసం క్రికెటర్లు కూడా కష్టపడుతున్నారు. వ్యక్తిగత కోచ్‌లను నియమించుకుని మరీ ఆటను మెరుగుపరుచుకుంటున్నారు’ అని అన్నాడు. కాగా, అక్రమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గతంలో బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అయితే, పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్‌లో నిషేధం విధించడంతో అక్రమ్ కోచ్ పదవినీ తీసేశారు.

Advertisement

Next Story

Most Viewed