- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్తాన్ ‘రాయల్’ గెలుపు
దిశ, వెబ్‌డెస్క్: భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. చివరి ఐదు ఓవర్లలో సిక్సర్ల మోతతో భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (4)లకే వెనుదిరిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్(50), సంజూ శాంసన్(85) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా.. కాట్రెల్ వేసిన 17వ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది మ్యాచ్‌ను మొత్తం రాజస్తాన్ వైపు తిప్పాడు.
మొత్తం 31 బంతుల్లో 53 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా.. చివరి ఆరు బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఆ తర్వాత బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. అయినప్పటికి కావాల్సిన పరుగులను చేయడంతో.. మిగతా స్పల్ప స్కోరును రాజస్తాన్ జట్టు ఛేదించగలిగింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ పై రాజస్తాన్ అనూహ్య విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా రాజస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ప్రత్యర్థి బౌలర్లు తలలు పట్టుకున్నారు. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-కేఎల్ రాహుల్ పెను విధ్వంసాన్ని సృష్టించి..16 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థి బౌలర్లను మైదానంలో పరిగెత్తించారు.
ముఖ్యంగా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(106) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 106 పరుగులు చేసి స్కోరు బోర్డును కూడా పరిగెత్తించాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ (69) తన దైన శైలిలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 16 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా ఈ ఓపెనర్లు ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు.
కాగా, 183 పరుగుల వద్ద టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన మయాంక్ శ్యామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే 194 పరుగుల వద్ద కేఎల్ రాహుల్.. రాజ్‌పుత్ బౌలింగ్‌లో బౌండరీకి ట్రై చేసి శ్రేయస్ గోపాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో భారీ స్కోర్ 194 వద్ద పంజాబ్ రెండు వికెట్లు (ఓపెనర్లు)ను కోల్పోయింది. వన్‌డౌన్ వచ్చిన మ్యాక్స్‌వెల్(13), నికోలస్ పూరన్ (25) పరుగులు చేయడంతో నిర్దిష్ఠ 20 ఓవర్లలో పంజాబ్ 223 పరుగులు చేయగలిగింది. ఇంత భారీ స్కోర్ చేసినా.. పట్టుదలతో రాజస్తాన్ ఆటగాళ్లు విజయం సాధించడం గమనార్హం.
స్కోరు బోర్డు:
Kings XI Punjab: లోకేష్ రాహుల్ (C, WK) (c) శ్రేయస్ గోపాల్ (b) రాజ్‌పుత్ 69(54), మయాంక్ అగర్వాల్ (c) శ్యామ్సన్ (b) టామ్ కుర్రాన్ 106(50), మ్యాక్స్‌వెల్ నాటౌట్ 13(9), నికోలస్ పూరన్ 25 (8) ఎక్స్‌ట్రాలు.. 10, మొత్తం స్కోరు: 223
వికెట్ల పతనం: 183/1 (మయాంక్ అగర్వాల్, 16.3), 194-2 (లోకేశ్ రాహుల్, 17.6).
బౌలింగ్: జయదేవ్ ఉనద్కట్ 3-0-30-0, అంకిత్ రాజ్‌పుత్ 4-0-39-1,
జోఫ్రా ఆర్చర్ 4-0-46-0, శ్రేయస్ గోపాల్ 4-0-44-0, టి. రాహుల్ 1-0-19-0, టామ్ కుర్రాన్ 4-0-44-1
Rajasthan Royals: జోస్ బట్లర్ (wk) (c) సర్ఫరాజ్ ఖాన్ (b) కాట్రెల్ 4(7), స్టీవ్ స్మిత్ (c) షమీ (b) నీషామ్ 50(27), సంజు శాంసన్ (c) మురుగన్ రాహుల్ (b) మహ్మద్ షమి 85 (42) రాహుల్ తెవాటియా (c) మయాంక్ అగర్వాల్ (b) షమీ 53 (31). ఉతప్ప (c) పూరన్ (b) షమి 9 (4), జోఫ్రా ఆర్చార్ నాటౌట్ 13(3), రియాన్ పరాగ్ (b)ఎం అశ్విన్ 0 (2), టామ్ కుర్రాన్ నాటౌట్ 4 (1) ఎక్స్‌ట్రాలు 8, టోటల్ స్కోరు: 226
వికెట్ల పతనం: 19/1 (జోస్ బట్లర్, 2.2), , 100-2 (స్టీవ్ స్మిత్, 8.6). 161/3 (సంజూ శాంసన్, 16.1), 203/4 (రాబిన్ ఉతప్ప, 18.1), 222/5 (రాహుల్ తెవాటియా, 18.6), 222/6 (రియాన్ పరాగ్, 19.2).
బౌలింగ్: కాట్రేల్3-0-52-1, మహ్మద్ షమి 4-0-53-3, రవి భిష్నోయ్ 4-0-34-0,
జేమ్స్ నీషామ్ 4-0-40-1 , మురుగున్ అశ్విన్1.3-0-16-1, మ్యాక్స్‌వెల్ 3-0-29-0.