కవితలకు ఆహ్వానం

by Shyam |
కవితలకు ఆహ్వానం
X

దిశ, న్యూస్ బ్యూరో: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు, ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు, జగజ్జనని అమ్మవారిపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాధ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కవితలను హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కవితలను 20 లైన్లకు మించకుండా తెలుగులో టైప్ చేసి 9703542598, 9182178653 నంబర్లకు వాట్సాప్ కు ఫోటోతో సహా పంపాలని కోరారు. కవితలను ఆగస్టు పదో తారీఖు వరకు పంపొచ్చున్నారు. కవితలన్నీ సంకలనంగా రూపొందించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story