- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీళ్లకు భారీగా లాభాలు.. కారణం లాక్ డౌన్!
దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్ తో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు లాభాలు గడిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర సేవలకే మంగళవారం వరకు అనుమతులు ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి కొన్ని సేవలకు మినహాయింపునకు అవకాశం కల్పించారు. ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఇంటికి పరిమితమై పనులు చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. కానీ, లాక్‌డౌన్ అన్నీ వ్యాపార వర్గాలను నష్టాల్లో ముంచింది. ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, నెట్‌వర్క్ ప్రొవైడర్లకు మాత్రం లాభాలు పంచుతోన్నది. అనేక మంది ఇళ్లలో ఉండి ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వాట్సాప్, వీడియో కాల్స్, సోషల్ మీడియా చాటింగ్, ఆన్‌లైన్ సినిమాలు ఇలా అనేక రకాలుగా ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు.
ఆన్‌లైన్ లో క్లాసులు, ప్రాజెక్టు వర్క్స్…
ప్రస్తుతం గుంపులు గుంపులుగా, సమూహాలుగా కలిసి పనులు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్నది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యక్తిగత పనులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కూడా ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఇక అనేక కంపెనీల ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’నిర్వహిస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు, కంపెనీలు, కూడా వీడియోకాల్స్‌లో తమ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఫలితంగా ఆయా వర్గాల్లోనూ ఇంటర్‌నెట్ వినియోగం పెరిగింది.
ఆన్‌లైన్‌లో గేమ్స్, చాటింగ్…
యువత, పిల్లలు కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌లో గేమ్స్, సోషల్ మీడియా సైట్లను చూస్తున్నారు. వీటన్నింటికీ అత్యధికమంది సర్వీస్ ప్రొవైడర్లపైనే ఆధారపడుతున్నారు. ఇంట్లో ఉండే ప్రజలు కాలక్షేపం కోసం ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. దీంతో నెట్‌స్పీడ్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువగా ఇంటర్‌నెట్‌ను వినియోగించడంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
ఆకర్షణతో ఇంటర్ నెట్…
ఇంటర్‌నెట్‌కు ఆకర్షితులై అధికంగా వాడుకుంటున్నారు. దీంతో అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. దాన్నే ఇంటర్‌నెట్ అడిక్షన్ అంటారు. అవసరం కొద్దీ ఇంటర్‌నెట్ చూడటం ఒకటైతే కొందరు అవసరం లేకున్నా, అసలు ఏం చూడాలో తెలియకున్నా నెట్‌లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటారు. అది క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఫలితంగా ఏకాగ్రత లేమి, పనిలో నాణ్యతాలోపం, పనిచేసే శక్తి సన్నగిల్లుతుంది. వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తగ్గిపోతాయి. ఒంటరితనం, ఆందోళన, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఊబకాయం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, జీవక్రియలో మార్పులు, నేర ప్రవర్తన, వ్యాధి నిరోధక శక్తి తగ్గటం తదితర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Tags: Rangareddy, Lockdown, Service Providers, Internet, Youth, Kids, Games