‘ఇంటర్మీడియట్ పేపర్లు కరెక్షన్ చేయం’

by Shyam |   ( Updated:2020-03-20 04:42:13.0  )
‘ఇంటర్మీడియట్ పేపర్లు కరెక్షన్ చేయం’
X

దిశ, నిజామాబాద్: ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యంకణం చేయబోమని లెక్చరర్లు తేల్చి చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డీఐఈఓ, ఇంటర్‌ స్పాట్ క్యాంపు ఆఫీసర్ ఒడ్డెన్నకు లెక్చరర్ల సంఘం నేతలు పెందోటి చంద్ర‌శేఖర్, శ్రీనివాస్, లింగమయ్య, భాస్కర్, లక్ష్మీనర్సయ్యలు వినతిపత్రం సమర్పించి, విధులు నిర్వహించకుండా వెళ్ళిపోయారు. కరోనా విస్తరణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయని, కానీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కరెక్షన్‌లో లెక్చరర్లు కలిసి పనిచేయాలి, గుంపులుగా ఉన్నా కరోనా వైరస్ విస్తరిస్తోంది కాబట్టి మూల్యంకణాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ విషయంపై క్యాంప్ ఆఫీసర్ ఒడ్డెన్నను వివరణ కోరగా మూల్యాంకణం వాయిదాపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

Tags : Intermediate, exam papers correction, Postponed, nizamabad, dieo

Advertisement

Next Story