- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీలో కేసీఆర్‌ను ఆశ్చర్యపరిచిన నామా.. కేంద్ర మంత్రి ప్రశంసలు
దిశ ప్రతినిధి, ఖమ్మం: అనునిత్యం పార్లమెంట్ వేదికల్లో తెలంగాణ ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు తనకు మంచి మిత్రుడని కేంద్ర వాణిజ్య, ఆహార పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంత్రి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీలంతా కేంద్రమమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. తొలుత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్‌రావు కేంద్రమంత్రికి శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం కేసీఆర్ స్పందిస్తూ.. హి ఈజ్ మిస్టర్ నామా నాగేశ్వరరావు అంటూ కేంద్రమంత్రి పీయూష్‌కి పరిచయం చేయబోయారు. సీఎం పరిచయ వ్యాఖ్యలు విన్న వెంటనే మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. “అఫ్‌కోర్స్, ఐ నో హిమ్. హి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్” అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారి పెదవులపై ఒక్కసారిగా భావోద్వేగ నవ్వులు విరిశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. 2019 నుంచి లోక్‌సభ, ఇతర వేదికల మీద నుంచి నామ నాగేశ్వర్‌రావు తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా విజ్ఞప్తి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగానే మంత్రి పీయూష్ గోయల్‌కు ఖమ్మం ఎంపీ సన్నిహితమై చేరువయ్యారు. కాగా, అనంతరం సీఎం కేసీఆర్ ఇతర ఎంపీలు, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైఎస్ ఛైర్మన్ వినోద్‌కుమార్‌ను కేంద్రమంత్రికి పరిచయం చేసి, తన డిమాండ్లపై ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు చర్చలు చేశారు.