ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసం లక్షల్లో ఖర్చు..

by Shyam |
Prabhas,-Hair-Style
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సాహో’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అంతకుమించిన పవర్‌ఫుల్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హోంబలె ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. ప్రభాస్ రెండు క్యారెక్టర్లలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలో తన హెయిర్ స్టైల్ గురించి మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా రూ. 4 లక్షలు కేటాయించారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలోనూ కేవలం హెయిర్ స్టైల్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయకపోవడం విశేషం. కాగా ఈ చిత్రంలో శ్రుతి హాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతుంది.

Advertisement

Next Story