- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భర్త లేకున్నా కష్టపడి చదివిస్తోంది.. కానీ, చేయకూడని పనిచేసిన కూతురిని చూసి తల్లి షాక్
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో లైంగిక వేధింపుల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ బాలిక తన పాఠశాల టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. కరూర్ జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లింది. పాఠశాల అయిపోగానే తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో నుంచి ఆ విద్యార్థిని ఎంతకు బయటకు రాకపోవడంతో పక్కనే ఉండే వృద్ధురాలికి అనుమానమొచ్చింది. వెళ్లి చూడగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా షాకైన వృద్ధురాలు ఆ బాలిక తల్లికి సమాచారమిచ్చింది. ఇప్పటికే భర్తను పోగొట్టుకున్న తల్లి.. తన బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ లభించింది.
‘నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనవారి గురించి చెప్పేందుకు భయంగా ఉంది. నేను ఇంకా చాలారోజులు బ్రతికి ఇతరులకు సాయం చేయాలని ఉంది. కానీ, చాలా త్వరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది. నా కుటుంబమంటే నాకు ఎంతో ఇష్టం. ఈ కఠిన నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమిచండి. కరూర్ జిల్లాలో లైంగిక వేధింపులకు బలయ్యే అమ్మాయిల్లో నేనే చివరి దానిని కావాలి’ అంటూ ఆ లేఖలో బాలిక పేర్కొన్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.