Telangana Inter Exams 2021 : జులైలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

by Anukaran |   ( Updated:2021-05-27 11:19:39.0  )
Telangana Inter Exams 2021 : జులైలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జులై రెండవ వారం తరువాత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తూ తదుపరి షెడ్యూల్‌ను జూన్ మొదటి వారంలో తెలియజేస్తాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచలన మేరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష సమయాన్ని 3గంటల నుంచి 90 నిమిషాలకు కుదించామని తెలిపారు. పరీక్షా పత్రాలు ఇప్పటికే సిద్ధంకావడం వలన పరీక్షా ప్యాట్రన్ ను ఏమాత్రం మార్చబోమని స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల్లోని 50శాతం ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలందిస్తే సరిపోతుందని వీటిని 100శాతం మార్కులుగా పరిగణిస్తామని తెలిపారు.

కొవిడ్ వ్యాధి వ్యాప్తి జరగకుండా విద్యార్థులు భౌతికదూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు చేపట్టి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఇందు కోసం ప్రతి పరీక్షకు రెండు సెట్ల ప్రశ్నా పత్రాలను ఎంపిక చేసి రెండు బృందాలుగా విద్యార్థులను విభజించి ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా వ్యాధితోనూ, ఇతర ఆరోగ్య సమస్యలతో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అవకాశాలను కల్పిస్తామన్నారు. మిగిలిన ప్రశ్నాపత్రాల సెట్లను అందించిన వారి కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తాని తెలిపారు.

Karnataka PU Board postpones practical exams, to conduct it after theory exam | The News Minute

ఇదిలా ఉండగా ఈ నెల 29న జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను కొవిడ్ వ్యాధి వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. జనరల్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, ఒకేషనల్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎప్పుడు నిర్వహిస్తామనేది జూన్ మొదటివారంలో తెలియజేస్తామన్నారు. పరీక్షలకు 15 రోజుల ముందుగానే పరీక్షా తేదీలను ప్రకటిస్తామని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని చెప్పారు. తొలిసారిగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రెల్ 7న నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో మే 29కి వాయిదా వేసారు. కోవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో రెండవ సారి కూడా ప్రాక్టికల్స్ ను వాయిదా వేసారు.

Advertisement

Next Story

Most Viewed