- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్ బాటలో ఇంటెల్.. ఆ ఉద్యోగుల వేతనాలు కట్
దిశ, వెబ్‌డెస్క్: టెక్ కంపెనీలు టీకా తీసుకోని ఉద్యోగుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకు ముందు గూగుల్ టీకా తీసుకోని తమ ఎంప్లాయిస్‌ను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు అదే బాటలో సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇంటెల్ కూడా చేరింది. టీకా తీసుకోని ఉద్యోగులను వేతనం లేని సెలవుల్లో ఉంచనున్నారు. మతపరమైన లేదా వైద్య పరమైన కారణాల వల్ల టీకా మినహాయింపు పొందని వారు ఏప్రిల్ నుంచి వేతనం లేని సెలవుల్లో ఉంటారు. జనవరి 4 లోగా టీకా వేసుకోవాలని సూచించింది. టీకా మినహాయింపుకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని కంపెనీ పేర్కొంది. ఇంటెల్ HR క్రిస్టీ పాంబియాంచి మాట్లాడుతూ.. టీకాలు తీసుకోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ మినహాయింపు కోరవలసి ఉంటుందన్నారు. మినహాయింపుకు ఆమోదం లభించకపోతే ఏప్రిల్ 4 నుంచి మూడు నెలల పాటు వేతనం చెల్లించని సెలవులో ఉంటారని తెలిపారు.