- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఘోర అవమానం..
దిశ, సంగారెడ్డి : అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఘోర అవమానం జరిగింది. సంగారెడ్డిలో దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు కొండాపురం జగన్, జిల్లా అధ్యక్షుడు అశ్వంత్ నాయకత్వంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద కుక్క మెడలో రసమయి ఫోటో తగిలించి మెడకు గులాబీ కండువా కట్టారు. రసమయి బాలకిషన్.. కేసీఆర్ పెంపుడు కుక్క అనే విధంగా అభివర్ణిస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ మాట్లాడుతూ.. రసమయి దళిత ద్రోహి, తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రధానమంత్రి మోడీని అన్ పార్లమెంటరీ పదాలతో విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. రసమయికి దమ్ముంటే దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ అంటూ దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. దళిత బంధు పథకాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అమలు చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జగన్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్‌తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌సీ మోర్చా జిల్లా అధ్యక్షులు యశ్వంత్, బీజేపీ జిల్లా నాయకులు శ్రీపతి తిరుపతి రావు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, జిల్లా నాయకులు రవీందర్, అనిల్ కుమార్, అంజి, ప్రవీణ్, రవి, మహిళా నాయకురాలు ఈశ్వరి, స్వర్ణలత, బుజ్జి చప్ప, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.