- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాంగ్ స్టర్‌కు సహకరించిన ఇన్ స్పెక్టర్ అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: యూపీ రాష్ట్రంలోని కాన్పూర్‌లో గ్యాంగ్ స్టర్‌తో చేతులు కలిపి 8 మంది పోలీసుల మరణానికి కారణమైన ఇన్‌స్పెక్టర్ వినయ్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 200 మంది పోలీసుల పాత్ర ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేతో చేతులు కలిపినట్లు దర్యాప్తులో తేలడంతో ఇప్పటికే అతన్ని సస్పెండ్ చేశారు. వికాస్ దుబే గ్రామం వినయ్ తివారీ పని చేస్తున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో అతడికి సహకరించినట్లు తెలుస్తోంది.
వికాస్ దుబే 60 కేసుల్లో ప్రధాన నిందితుడు. హత్యలు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణా వంటి కేసులు అతడిపై నమోదయ్యాయి. అతడ్నిపట్టుకునేందుకు 50 మంది పోలీసులు తెల్లవారు జామున అతడి గ్రామానికి వెళ్లగా.. ఆ సమాచారాన్ని అదే స్టేషన్ నుంచి వికాస్ దుబేకు చేరవేశారు. అప్రమత్తమైన గ్యాంగ్ స్టర్ గ్రామ శివారులో జేసీబీని అడ్డుపెట్టి కాల్పులు జరపగా డీస్పీ, సీఐలు సహా 8 మంది పోలీసుల మృతి చెందారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే, అతడి అనుచరులు పారిపోయారు. తాజాగా, వారిలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. ఒకడిని కాల్చి చంపారు. వికాస్ దూబేకి కొందరు పోలీసులే సహకారం అందిస్తున్నారని ముఖ్యంగా, చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వినయ్ తివారీ హస్తం ఉందని ఆరోపిస్తూ గతంలో ఓ డీఎస్పీ అప్పటి కాన్పూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఆ డీఎస్పీని కూడా ఇలాగే దొంగ దెబ్బ తీసి వికాస్ దూబే చంపేశాడు.