- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఎడమచేతి మధ్య వేలికి..
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారందరికీ ఒక వేలికి మాత్రమే ఇంకు గుర్తు ఉంటుంది. కానీ ఓల్డ్ మలక్‌పేట్‌లోని కొద్దిమంది ఓటర్లకు మాత్రం రెండు వేళ్ళకు గుర్తులు ఉండనున్నాయి. జీహెచ్ఎంసీ ఆరవ సర్కిల్‌లోని 26వ డివిజన్ (ఓల్డ్ మలక్‌పేట్)లో సీపీఐ అభ్యర్థికి కేటాయించాల్సిన ఎన్నికల గుర్తులో తేడాలు రావడంతో అక్కడ ఈ నెల 3వ తేదీన రీపోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఓటు వేసినవారికి ఎడమచేతి చూపుడు వేలుకు ఇంకు గుర్తును వేశారు ఎన్నికల సిబ్బంది. అయితే పోలింగ్ ప్రక్రియను రద్దుచేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తున్నందున ఈసారి ఎడమ చేతి మధ్యవేలికి ఇంకు గుర్తును వేయనున్నారు.
ఒకవేళ ఎడమచేయి లేని వారికి కుడిచేతికి వేస్తారు. ఎడమచేతికి మధ్యవేలు లేనివారికి మరో వేలికి గుర్తు వేస్తారు. ఒకవేళ రెండు చేతులూ లేనివారికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అవసరంగా గుర్తించి నిబంధనల మేరకు తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటుంది.