‘దళితులకు అన్యాయం.. సచివాలయంలో కుట్రలు’

by Anukaran |   ( Updated:2021-08-28 08:02:28.0  )
RS-praveen-knr
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత నేతలకు విందు ఇచ్చిన కేసీఆర్.. దళిత ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేశారని బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్​కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశంలో ఆయన ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. ఒకవైపు ఎస్సీ నేతలతో సీఎం గారి విందు.. మరోవైపు హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు బంధు అంటూ సెటైర్లు వేశారు. సచివాలయం కారిడార్లలోనే చాలా కుట్రలు, డ్రామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవన్నీ కేసీఆర్‌కు తెలియకుండా జరుగుతున్నాయా.. అంటూ ప్రశ్నించారు. బహుజన ఉద్యోగులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కారు దిగి.. ఏనుగెక్కి(బీఎస్పీలో చేరి) పాలకులు కావాలంటూ సూచించారు. ప్రస్తుతం ఉద్యోగుల అంశంలో ప్రవీణ్​ కుమార్ ​ట్వీట్​ హాట్‌ టాపిక్‌గా మారింది. సచివాలయంలో దాదాపు 25 మంది దళిత అధికారులకు ప్రమోషన్లు ఇచ్చినా.. వాటిని మళ్లీ రివర్స్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం చేస్తున్నామంటూ సీఎస్​ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల అంశంపై ప్రవీణ్ కుమార్ స్పందించారు.

Advertisement

Next Story