- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమ్మిన్స్‌పై తీవ్ర విమర్శలు
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌పై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పింక్ బాల్ టెస్టు శనివారం రోజు టీమ్ ఇండియా 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లు మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్‌లు ఆడుతున్నారు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన కమ్మిన్స్, హాజల్‌వుడ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. అప్పుడు ఒక్క బౌన్సర్ కూడా విసరని కమ్మిన్స్.. అనూహ్యంగా షమిపై బౌన్సర్ సంధించాడు.
సాధారణంగా ఏ బౌలర్ కూడా టెయిలెండర్లపై తమ ప్రతాపం చూపించరు. వాళ్లు ఎలాగో జట్టు భారాన్ని మోసే అవకాశం కూడా లేదు. అయినా సరే కొంచెం కూడా కనికరం చూపకుండ విసిరిన బౌన్సర్ షమి కుడి మోచేయి కింద బలంగా తగిలింది. దీంతో బాధతో విలవిల్లాడాడు. భారత జట్టు ఫిజియో వచ్చి పెయిన్ కిల్లర్ స్ప్రే పూసి, బ్యాండ్ వేసినా అతడి నొప్పి తగ్గలేదు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవీలియన్‌కు వెళ్లిపోయాడు. షమీని వెంటనే ఆసుపత్రికి తరలించి స్కానింగ్ చేశారు. ఇంకా రిపోర్టు రావాల్సి ఉన్నది. షమీ తన చేతిని కూడా ఎత్తలేక పోతున్నాడని కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు.