అంచనాలను మించి వృద్ధి సాధించిన ఇన్ఫోసిస్!

by Harish |
అంచనాలను మించి వృద్ధి సాధించిన ఇన్ఫోసిస్!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అద్భుతమైన ఫలితాలను వెల్లడించింది. మార్కెట్ అంచనాలను అధిగమించి మూడో త్రైమాసిమలో కంపెనీ నికర లాభాలు 16.8 శాతం పెరిగి రూ. 5,215 కోట్లుగా నమోదైంది.గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,466 కోట్ల లాభాలను వెల్లడించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 7.3 శాతం వృద్ధి అని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయం 12.3 శాతం పెరిగి రూ. 25,927 కోట్లకు చేరుకుంది.

అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 25.4 శాతంగా ఉందని, అదేవిధంగా డిజిటల్ ఆదాయం మొత్తం ఆదాయంలో 50 శాతాన్ని దాటాయని కంపెనీ పేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాల్లో కంపెనీ ఆదాయంలో ఈ స్థాయి వృద్ధి నమోదవడం ఇదే తిలిసారని, డాలర్ రూపంలో సైతం కంపెనీ ఆదాయం 8.4 శాతం పెరిగి 3,516 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed