- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరోనా వ్యాధి నివారణకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వ్యాధి నివారణ కోసం చర్యలు తీసుకుంటుదని చెప్పారు. అవసరమైన పడకలు, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా కరోనా కేసు నమోదు కాలేదని, ఇది అధికారుల నిబద్ధతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులోనూ ఇవే ప్రమాణాలు పాటించి వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషిచేయాలని మంత్రి కోరారు. ఎవరూ భయపడే అవసరం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జాతరలు, పెళ్లిళ్లు, మతపరమైన కార్యక్రమాలను రద్దు చేసుకుని అందరూ సహకరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Tags: indrakaran reddy, comments, carona virus, adilabad