హుజురాబాద్‌లో పోటీపై గన్ పార్క్ వద్ద ఇందిరా శోభన్ కీలక ప్రకటన

by Shyam |   ( Updated:2021-08-25 01:39:54.0  )
Indira Shobhan
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీనియర్ నేత ఇందిరా శోభన్.. వైఎస్ షర్మిలకు షాక్ ఇస్తూ వైఎస్‌ఆర్‌టీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇందిరా శోభన్ బుధవారం ఉదయం గన్ పార్క్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉద్యోగులను విధుల నుంచి తొలగించే హక్కు సీఎంకు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 54 వేల మంది ఉద్యోగులను తొలగించారు. పని చేసిన వారికి జీతాలు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతోందని.. ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించారని ఇందిర ఆరోపించారు. ప్రైవేటు టీచర్లకు రూ. 2వేలు, బియ్యం అందడం లేదు. గెస్ట్ లెక్చరర్లను కూడా పనిలోకి తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేవలంలో కేసీఆర్ కుటుంబంలో మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ కూతురు కవితకు ఉద్యోగం లేదని వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని ఎద్దేవ చేశారు. సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాకే వీరి ఆత్మహత్యలు ఎక్కవయ్యాయని విమర్శలు చేశారు.

హుజురాబాద్ ఎన్నికల కోసమే అన్ని అభివృద్ధి పనులు అక్కడే చేస్తున్నారు. అందుకే అన్ని సమస్యలపై 27న హుజురాబాద్‌కు ‘ఉపాధి భరోసా యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తున్నట్టు వెల్లడించారు. పదవులు నాకు ముఖ్యం కాదు. ప్రజా సమస్యలపై పోరాడటమే నా ధ్యేయమని చెప్పారు. అలాగే హుజురాబాద్‌లో తాన పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట ఆలయంలో పూజ అనంతరం ఈ యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. సీఎం 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇలా దేశంలోని ఏ సీఎం చేయలేదని వెల్లడించారు. ఉన్న భూములు అమ్మి మరీ ఎన్నికలకు పోవడం సిగ్గుచేటని అన్నారు. దళిత బంధు కాదు.. పేదల బంధు కావాలని కోరారు. ఈ సందర్భంగా యాత్ర వాల్ పోస్టర్‌ను ఇందిరా శోభన్ ఆవిష్కరించారు. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రజా సమస్యలపైనే నా పోరాటమని ఆమె తెలిపారు.

Advertisement

Next Story