- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా గోస ఎవరికి రావొద్దు.. గెస్ట్ లెక్చర్లను విధుల్లోకి తీసుకోండి..
దిశ, ప్రతినిధి, మహబూబ్‌నగర్: గతంలో ఆయా కళాశాలల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర నాయకులు ఇందిరా శోభన్, హర్షవర్దన్ రెడ్డిలు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గణేశ్ చారి (30) బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో.. ఇందిరా శోభన్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేలాది మంది యువత పోరాటం, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక పిట్టల్లా రాలుతున్నా.. ఈ ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్‌లతో పాటు, పాఠశాలల్లో పనిచేసే విద్యా వాలంటీర్లు, ఇతర సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మా గోస ఎవరికి రావొద్దు..
చేతికొచ్చిన కొడుకు పోయాడు. ఈ గోస మరే తల్లిదండ్రులకు రావొద్దంటూ గణేశ్ చారి తండ్రి, కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మిగిలిన వాళ్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.