- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండిగోలో వాటాల విక్రయం
ముంబయి: దేశీయ అతిపెద్ద వైమానిక సంస్థ ఇండిగో (indigo air lines) తన వాటాలను విక్రయించనున్నట్టు సోమవారం ప్రకటించింది. కొవిడ్-19 మహమ్మారి (covid-19) కారణంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యకలాపాల నిర్వహణకు నగదు లేకపోవడంతో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.4,000కోట్లను సమీకరించనున్నట్టు స్పష్టం చేసింది.
వైరస్ వ్యాప్తి కారణంగా మొదటి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రంగా నష్టపోయినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ( inter globe aviation) గత నెలలో తెలిపింది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ సమయంలో వాటాల అమ్మకం గురించి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఆస్తుల అమ్మకం, విమానాల లీజ్ వెనక్కి ఇవ్వడం, అమ్మకం ద్వారా దాదాపు రూ.2000 కోట్లను సమీకరణ కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు గత నెలలో ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ భయాందోళనలతో జనం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ప్రయాణాలకు దూరంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు నగదు సమీకరణకు దారులు వెతుకుతున్నాయి. అయితే, 2024 నాటి వరకు గాని వైమానిక రంగం (air lines sectors) కరోనా వ్యాప్తి ముందు స్థితికి చేరుకోదని ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఐఏటీఏ తెలుపడం గమనార్హం. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత మార్చి ఆఖరు నుంచి రెండు నెలలపాటు లాక్‌డౌన్ విధించడంతో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అదే సమయంలో డిమాండ్ లేకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం కారణంగా అప్పటికే కార్గో సేవలు ( cargo services) దెబ్బతిన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,849కోట్ల నికర నష్టాన్ని ఇండిగో ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1200కోట్ల నికరలాభం ఆర్జించడం గమనార్హం.