- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా కలవరం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో విమానప్రయాణాలు చాలా మేరకు తగ్గిపోయాయి. కస్టమర్లు లేక విమానరంగం కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. అయితే, నష్టాల భారీ నుంచి తప్పించుకోవడానికి.. కస్టమర్లకు కరోనా భయం లేని ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్ ప్రకటించింది.
విమానంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాలనుకునే ప్యాసింజర్స్‌కు కావాలంటే రెండు సీట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందుకోసం 6E డబుల్ సీట్ స్కీంను ఈనెల 24న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.అదనపు సీటు బుక్ చేసుకునే వారు వాస్తవ టికెట్ ధర కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో యాజమాన్యం స్పష్టంచేసింది. దీని ప్రకారం ప్రయాణికుడు బుక్ చేసుకున్న సీట్ పక్కనే రెండోది కూడా కేటాయిస్తామని తెలిపింది.
Advertisement
Next Story