- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది’
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని కొత్త వ్యవసాయ చట్టాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని, అయితే, బలహీన సాగుదారులకు సామాజిక భద్రతను అందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం ఉన్నట్టు గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలతో సహా సంస్కరణకు అవసరమన్నారు.
‘కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించినవి, ఇవి రైతుల మార్కెట్‌ను విస్తృతం చేస్తాయి. వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే కాకుండా తమ ఉత్పత్తులను వివిధ మార్గాల్లో విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా పన్ను చెల్లించకుండా విక్రయించే వీలున్నందూ రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, సంస్కరణలు చేసినపుడు బలహీన వర్గాలు నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలి. వారి జీవన భద్రతను కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థను తీసుకురావాలి. ఈ అంశం నుంచి చర్చ ప్రారంభమైంది. దీని ఫలితం ఎలా ఉండనున్నదో వేచి చూడాలి’ అని గీతా గోపీనాథ్ వివరించారు.