- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్థికవ్యవస్థ అనిశ్చితిలో ఉంది : ప్రణబ్ సేన్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత భారత ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉందని, 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 10 శాతం ప్రతికూలంగా ఉండోచ్చని మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ ప్రణబ్ సేన్ ఆదివారం చెప్పారు. ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలు మెరుగైనవి కానప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న మందగమనాన్ని నియంత్రించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆర్థికవ్యవస్థ చుట్టూ ఉన్న ఆశావాదం ఉందని భావిస్తున్నాను. భారత ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10 శాతం ప్రతికూలంగా ఉంటుందని’ ప్రణబ్ సేన్ తెలిపారు.
ఇటీవల జీడీపీ గణాంకాలు కార్పోరేట్ సంస్థ మెరుగైన ఫలితాల వల్ల వచ్చాయని, కార్పొరేటేతర రంగం స్థాయిలో కార్పొరేట్ సంస్థలు అంతగా నష్టపోలేదని ప్రణబ్ తెలిపారు. ఎంఎస్ఎంఈలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రణబ్ ప్రస్తావించారు. కొత్త ఉత్పత్తి సమార్థ్యాన్ని సృష్టించేందుకు పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే వరకు ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందదని ఆయన అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. తయారీలో పెరుగుదల జీడీపీని 7.5 శాతం ప్రతికూలానికి తగ్గించేందుకు దోహదపడింది. వినియోగదారుల డిమాండ్ మెరుగ్గా ఉందని ప్రణబ్ సేన్ వెల్లడించారు.