ఇండియన్ రైల్వే మరో రికార్డు.. అక్కడి 15 స్టేషన్లలో WIFI ఫెసిలిటీ..

by Shamantha N |   ( Updated:2021-06-20 05:36:34.0  )
ఇండియన్ రైల్వే మరో రికార్డు.. అక్కడి 15 స్టేషన్లలో WIFI ఫెసిలిటీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్రం నూతన చర్యలు చేపడుతోంది. ఇన్ని రోజులు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రైల్వేను పబ్లిక్ అండ్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రైల్వే స్టేషన్లు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడంతో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుందని సెంట్రల్ గవర్నమెంట్ భావించినట్లు సమాచారం.

ఈ క్రమంలో డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ వ్యాలీలో గల 15 రైల్వే ‌స్టేషన్లలో రైల్ వైర్ వైఫై(WIFI) నెట్వర్క్ సేవలను కల్పించారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ఇంటర్నెట్ సౌకర్యాలు కలిగిన రైల్వే స్టేషన్ల జాబితాలో కశ్మీర్ ప్రాంతం కూడా భాగస్వామ్యం కానుందని తెలిపారు. దీనిని రైల్వే శాఖలో చేపట్టిన ముఖ్యమైన అడుగుగా గోయెల్ వర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed