రైల్వే రిజర్వ్‌డ్ టికెట్ల రీఫండ్ నియమాలు సడలింపు

by vinod kumar |
రైల్వే రిజర్వ్‌డ్ టికెట్ల రీఫండ్ నియమాలు సడలింపు
X

హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 3 వరకు పొడగించిన నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ కూడా అన్ని రైలు సర్వీసులను 3వ తేదీ వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రద్దైన అన్ని రైళ్లకూ టికెట్ బుకింగ్స్ చార్జీలు పూర్తిగా రీఫండ్ చేస్తామనీ, దీనికి సంబంధించిన నియమాలను సడలిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసిన వినియోగదారులకు ఆటోమేటిగ్గా రీఫండ్ జమ అవుతుందనీ, కౌంటర్ల వద్ద బుక్ చేసుకున్న వారు జూలై 31 వరకు రీఫండ్ డబ్బులను తీసుకోవచ్చునని పేర్కొంది. అలాగే, రద్దు కాని రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న కస్టమర్లకు సైతం పూర్తి రీఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్లు అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సి.హెచ్ రాకేశ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags: indian railway, south central railway, railway tickets refund, lockdown, E-ticket, railway services

Advertisement

Next Story

Most Viewed