- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పైప్‌లైన్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారీ పెట్టుబడి
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) గుజరాత్‌లోని ముంద్రా నుంచి హర్యానాలోని పానిపట్ వరకు కొత్తగా ముడి చమురు పైప్‌లైన్ వేయనుంది. ఈ పెట్టుబడి విలువ రూ.9,028 కోట్లు. సంవత్సరానికి 17.5 మిలియన్ టన్నుల నేమ్‌ప్లేట్ సామర్థ్యం కలిగిన పైప్‌లైన్‌ను నిర్మించనుంది. ఈ పైప్‌లైన్ ద్వారా ముడి చమురును గుజరాత్ తీరం నుండి హర్యానాలోని సంస్థ రిఫైనరీకి రవాణా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం IOC ముంద్రాలో 60వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 9 ముడి చమురు ట్యాంకులను నిర్మిస్తుంది.
IOC పానిపట్ రిఫైనరీని సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల నుంచి 25 మిలియన్ టన్నులకు విస్తరించనుంది. దానితో పాటు పాలీప్రొఫైలిన్ యూనిట్, ఉత్ప్రేరక డీవాక్సింగ్ యూనిట్‌ను 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ముడి చమురు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను త్వరలోనే పూర్తిచేయనున్నట్టు ఐఓసీ తెలిపింది.