- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ యాప్స్‌లో పార్ట్‌నర్ సెలెక్షన్.. ఓకే చెబుతున్న పేరెంట్స్
దిశ, ఫీచర్స్: మనిషి జీవితాన్ని పెళ్లికి ముందు, తర్వాత అని చెప్పడం సముచితం. ఎందుకంటే జీవిత భాగస్వామి రాకతో ఎవరి లైఫ్‌స్టైల్ అయినా ఖచ్చితంగా మారిపోతుంది. అందుకే నూరేళ్లు కలిసి బతకాల్సిన తోడును ఎంపిక చేసే విషయంలో అంత పర్టిక్యులర్‌గా ఉండే పెద్దలు.. అటు ఏడు, ఇటు ఏడు తరాలు చూసిగానీ సంబంధానికి ఓకే చెప్పరు. ఇదిలా ఉంటే, డేటింగ్ సైట్స్/యాప్స్‌పై తల్లిదండ్రులకు ఎలాగూ నమ్మకం ఉండదు గనుక చాలా మంది తమ కుమారుడు/కుమార్తెకు సాంప్రదాయ మార్గంలోనే లైఫ్ పార్ట్‌నర్‌ను సెలెక్ట్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. మిలీనియల్స్, జెన్-జెడ్‌లు వారి డేటింగ్ జీవితంపై నియంత్రణ కలిగి ఉన్నారు. ఎప్పుడు, ఎలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయంలో సొంత నిర్ణయాలకే ఓటేస్తుండగా.. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల డెసిషన్‌కు పూర్తి మద్ధతిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 5,000 మంది యువతీ యువకులు పార్టిసిపేట్ చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. తమ పిల్లలు డేటింగ్ యాప్స్‌లో భాగస్వాములను ఎంచుకోవడం పట్ల 50 శాతం మిలీనియల్స్, జెన్ జెడ్ పేరెంట్స్ సంతోషంగా ఉన్నారని తేలింది. ట్రూలీ మ్యాడ్లీ (TrulyMadly) అనే డేటింగ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో ఢిల్లీ నుంచి 86 శాతం మంది తల్లులు తమ పిల్లల విషయంలో ప్రేమ వివాహాలను ఎక్కువగా ఆమోదిస్తున్నట్లు తేలింది.
సర్వేలోని మరిన్ని విశేషాలు:
* తండ్రుల కంటే తల్లులే.. తమ వివాహం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని 45 శాతానికి పైగా చెప్పారు.
* టైర్-1, టైర్ -2 నగరాల నుంచి దాదాపు 70 శాతం మంది స్త్రీలు, 80 శాతం మంది పురుషులు తమ తల్లులు ప్రేమ వివాహాన్ని ఇష్టపడతారని తెలిపారు.
* తమ తల్లులకు ‘డేటింగ్ యాప్స్ గురించి తెలియదు’ అని 20 % కంటే తక్కువ మంది పంచుకున్నారు.
* తమ నిర్ణయానికి కేవలం ఏడు శాతం మంది మాత్రమే అనుకూలంగా లేరని పేర్కొన్నారు.
* జైపూర్, ఇండోర్, లక్నో వంటి మెట్రోయేతర నగరాల్లో తల్లులు తమ కుమార్తెల వివాహ విషయంలో సంతృప్తిగా ఉండగా, కుమారుల పెళ్లి విషయంలో మాత్రం 55 శాతం మంది పేరెంట్స్ ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడైంది. కానీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న మహిళలను వివాహం చేసుకోవాల్సిందిగా 53 శాతం మంది తల్లులు ఒత్తిడి చేస్తున్నారని తేలింది.
* కెరీర్ కంటే పెళ్లికి ప్రాధాన్యతనిస్తామని 60 శాతం మంది తల్లులు పేర్కొనగా, 46 శాతం మాత్రం పెళ్లికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
* 54 శాతం మంది తల్లులు తమ కొడుకు చదువు, కెరీర్ కోసం ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
సానుకూల మార్పులు ఉన్నప్పటికీ, 22 శాతం మంది డేటింగ్ యాప్‌ల వాడకం గురించి చర్చించేందుకు నిరాకరించగా.. కొంతమందిలో మాత్రం డేటింగ్ యాప్స్ నిషేధించాలనే ఆలోచన ఉంది. సమాజంలో మహిళా హక్కుల కోసం, లింగ వివక్షను తగ్గించడానికి, మూస పద్ధతికి వ్యతిరేకంగా జరిగిన నిరంతర ప్రయత్నాల నుంచి ఈ పరిణామం రాగా, ఈ అధ్యయన ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. వయస్సు-పాత సామాజిక నియమాలతో బంధీలుగా భావించిన చాలామంది తల్లులు, వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ముందుముందు మహిళల ఆలోచన విధానాల్లో, సమాజ ధోరణిలో మరింత మార్పు వస్తుంది.
– స్నేహిల్ ఖానోర్, TrulyMadly సహ వ్యవస్థాపకుడు, సీఈవో