- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గృహ వినియోగదారులపై ఆందోళనకర స్థాయిలో ఆర్థిక ఒత్తిడి : ఎస్‌బీఐ నివేదిక
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా చాలా కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి లోనయ్యాయని, ఈ ఏడాది సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. అలాగే, ఆగష్టులో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, ఇది థర్డ్ వేవ్‌కి దారితీయవచ్చని అభిప్రాయపడింది. గృహ వినియోగదారుల్లో పెరుగుతున్న రుణాల ఒత్తిడి ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి. కమర్షియల్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, ఎన్‌బీఎఫ్‌సీ లాంటి ఆర్థిక సంస్థల నుంచి రిటైల్ రుణాలు, పంట రుణాలు, వ్యాపార రుణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2020-21లో గృహ వినియోగదారుల రుణాలు జీడీపీలో 32.5 శాతం నుంచి 37.3 శాతానికి పెరిగిందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు క్షీణించడం, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయం కారణంగా గృహ వినియోగదారుల రుణాలు భారీగా పెరుగుతాయని, గతేడాది కంటే ఈ ఏడాదిలో పరిస్థితి మరింత దిగజారిపోతుందని నివేదిక వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక విధాన చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ నివేదిక సూచించింది. సెకెండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ గురించి ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది. ఆగష్టులో థర్డ్ వేవ్ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని, జులై నాటి సెకెండ్ వేవ్ పరిణామాలను గమనిస్తే ఆగష్టు రెండో వారం తర్వాత కేసులు మళ్లీ పెరుగుతాయని నివేదిక అభిప్రాయపడింది.