'బడ్జెట్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి తప్పనిసరి'!

by Harish |
బడ్జెట్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థికవ్యవస్థ 2021లో రికవరీ సంకేతాలను చూపిస్తోందని పరిశ్రమల సమాఖ్య తెలిపింది. వినియోగదారుల విశ్వాసం పెరగడం, బలమైన ఆర్థిక మార్కెట్లు, తయారీలో పెరుగుదల, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్లలో సానుకూలంగా ఉండటం లాంటి పరిణామాలతో ఆర్థికవ్యవస్థ రికవరీవైపుగా మారుతోందని అసోచామ్ వెల్లడించింది. 2020 చివరి రెండు నెలల్లో రికవరీ బలంగా ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ చెప్పారు.

కరోనా మహమ్మారి తయారీ, సేవల రంగాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపడంతో భారత జీడీపీ 7.7 శాతం కుదించుకుపోతుందని ప్రభుత్వం గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘దేశీయంగా రెండు వ్యాక్సిన్లకు ఆమోదంతో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆతిథ్య, రవాణా, వినోద రంగాలకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని’ అసోచామ్ అభిప్రాయపడింది.

‘2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రధాన ఉత్ప్రేరకంగా ఉండనుందని, ఆరోగ్య, వ్యవసాయ రంగాలు సహా, డిమాండ్ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి అత్యవసరమని’ దీపక్ తెలిపారు. ఆసుపత్రుల నుంచి వైద్య విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, శాస్త్రీయ ప్రయోగశాలలు, లాజిస్టిక్‌లతో పాటు ఔషధ పరిశ్రమ వరకు మొత్తం ఆరోగ్య సంరక్షణకు రాబోయే బడ్జెట్‌లో మద్దతును పెంచాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed