- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'విహారం విషాదంగా మారుతుందేమో..కాపాడండి'
విహార యాత్ర విషాదయాత్రగా ముగుస్తుందేమోనని బెంగాలీ వాసి భయపడుతున్నాడు. జపాన్ కు చెదిన క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్ లో విహారయాత్రకు సుమారు 200 మంది భారతీయులు జపాన్ వెళ్లారు. అక్కడ సముద్ర జలాల్లో హాయిగా విహారిస్తుండగా అనుకోని అతిథిలా పెను ప్రమాదం పడవను చుట్టుముట్టింది. దీంతో విహార యాత్ర విషాద యాత్రగా మారుతుందేమోనన్న భయంతో భారత ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా రక్షించమని కోరుతున్నాడు.
ఈ నౌక జపాన్ తీరంలో బయల్దేరి చైనాలోని వూహాన్ నగరంలో లంగరేసింది. ఈ సమయంలో ఓడలోని ఒక వ్యక్తి బయటకు వెళ్లాడు. ఆయన తిరిగి వస్తూ కరోనా వైరస్ ను వెంటబెట్టుకుని వచ్చాడు. అంతే వూహాన్ లోని కరోనా భయం ప్రపంచాన్ని చుట్టేంతలో క్రూయిజ్ షిప్ ని కరోనా కమ్మేసింది. తొలి రెండు రోజులు రెండు అనుమానిత కేసులు నమోదు కాగా, నెమ్మదిగా ఆసంఖ్య విస్తరిస్తూ ఇప్పటికి 64కి చేరింది. నిన్న ఒక్కరోజే 21 మందికి సోకింది. దీంతో ఆ పడవలో ఉన్నావారు బెంబేలెత్తిపోతున్నారు.
పడవలో ఉన్న భారతీయుడు వినయ్ కుమార్ సర్కార్ తన ఫేస్ బుక్ ఖాతాలో వీడియో విడుదల చేశాడు. అందులో ఓడలో సిబ్బంది, ప్రయాణీకుల్లో సుమారు 200 మంది భారతీయులున్నారని..వారంతా కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. పడవలోని గదులు దాటి బయటకు వెళ్లడం లేదని, తమకు చాలా భయంగా ఉందని పేర్కొన్నాడు. దయచేసి భారత ప్రభుత్వం తమకు సాయం చేసి, తమను రక్షించాలని విన్నవించుకుంది. దీంతో భారత దౌత్యకార్యాలయం వారికి సాయమందించేందుకు చర్యలు చేపట్టింది.