న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ మహిళ

by vinod kumar |
న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ మహిళ
X

దిశ,వెబ్‌డెస్క్ : ఇండియన్-అమెరికన్ న్యాయ నిపుణురాలు సరిత కోమటిరెడ్డిని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనిర్సిటీ లా ఆఫ్ స్కూల్‌లో న్యాయ విద్యను అభ్యసించిన సరిత.. ఆ తర్వాత కెలాగ్ హన్సెట్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. అమెరికా న్యాయ విభాగంలో పలు హోదాల్లో ఆమె పని చేశారు. అమెరికాలోని ప్రముఖ లాయర్ల వద్ద అప్రెంటిస్, అసిస్టెంట్‌గా పని చేసి అనుభవం గడించారు. 2018-19లో ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీలాండరింగ్, 2016-19 వరకు కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటింగ్ సిస్టమ్‌కు యాక్టింగ్ డిప్యుటీ చీఫ్‌గా సరిత పని చేశారు. ఫిబ్రవరిలోనే సరిత నామినేషన్ ఖరారైనా.. తాజాగా ఈ ప్రతిపాదనను ట్రంప్ సెనేట్‌కు పంపారు. సెనేట్ ఆమోద ముద్ర తర్వాత ఆమె అధికారికంగా న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆమె కొలంబియా లా స్కూల్‌లో ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. తెలంగాణకు చెందిన సరిత తల్లిదండ్రులు చాలా ఏండ్ల కిందటే అమెరికాకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తండ్రి హనుమంత్‌రెడ్డి మిస్సోరీలో కార్డియాలజిస్ట్‌గా.. తల్లి రుమటాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. సరిత నామినేషన్ పట్ల అమెరికాలోని పలువురు భారతీయులు అభినందనలు తెలియజేశారు.

Tags : Donald Trump, Saritha Komatireddy, Eastren District, New York, America, Telangana, Attorney

Advertisement

Next Story

Most Viewed