- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజీలాండ్‌పై టీమిండియా విక్టరీ.. టీ20 సిరీస్ మనదే
దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా జరిగిన టీ20 రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిన న్యూజీలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు సఫలం అయ్యారు. ముఖ్యంగా జట్టు గెలుపులో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు, రోహిత్ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు బాది 55 పరుగులు తీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులతో రాణించగా సూర్యకుమార్ యాదవ్ 1 పరుగుకే ఔట్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ (12)గా నిలిచి జట్టును గెలిపించుకున్నారు. ఈ క్రమంలో 17.2 ఓవర్లలో టీమిండియా 155 పరుగులు చేసి విజయం సాధించింది.