- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అండర్ 19 ఆసియా కప్: సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్
దిశ, వెబ్‌డెస్క్: అండర్ 19 ఆసియా కప్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. 4 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచి సెమీస్ ఆశలను నిజం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా అండర్ 19 జట్టు ఓపెనర్లను కట్టడి చేసినా.. మిడిలార్డర్లు చెలరేగారు. సులేమాన్ అరబ్‌జీ 18మహ్మద్ ఇషాక్ 19, అల్లా నూర్ 26 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ సులేమాన్ సఫీ (73), ఇయాన్ అహ్మద్ అహ్మద్‌జాయ్ (86) అద్భుత ఇన్నింగ్ ఆడారు. చివర్లో ఖైబర్ (20) పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ 259 పరుగులు చేసింది.
ఇక 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ హర్నూర్ సింగ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 65 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరో ఓపెనర్ రఘువంశీ 35 పరుగులు తీసి పర్వాలేదనిపించాడు. ఇక మిడిలార్డర్లు షేక్ రషీద్ (6), యాష్ దుల్ (26), నిషాంత్ (19) క్రీజులో నిలువలేకపోయారు. ఇటువంటి సమయంలో రాజ్ భవ (43 నాటౌట్), కుషాల్ తాంబే (35 నాటౌట్)గా నిలిచి జట్టును గెలిపించుకున్నారు. దీంతో ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో ఇండియా అండర్ 19 జట్టు గెలిచింది. ఈ మ్యాచ్ విజయంతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే గ్రూప్ బీ నుంచి శ్రీలంక, బంగ్లా జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా.. గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్, భారత్‌లు ప్లేస్ కన్ఫామ్ చేసుకున్నాయి. ఇక ఈ మ్యాచుల్లో గ్రూప్ ఏ జట్లు గెలిస్తే.. ఫైనల్‌లో దాయాది జట్లు తలపడనున్నాయి.