భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 20 శాతం క్షీణత

by  |   ( Updated:2021-05-10 10:18:46.0  )
భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 20 శాతం క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సెకెండ్ వేవ్ కరోనా ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15-20 శాతం క్షీణించే అవకాశం ఉందని సోమవారం ఓ నివేదిక తెలిపింది. దీంతోపాటు సరఫరా వ్యవస్థలో అంతయారాం, కాంపొనెంట్ పరికరాల కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సైబర్‌ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్‌) తన నివేదికలో తెలిపింది. రీమొట్ వర్కింగ్, ఈ-లెర్నింగ్ విభాగాలను కొనసాగించడం ద్వారా ఈ ఏడాది రెండో సగంలో స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ మెరుగైన అమ్మకాలను సాధించగలదని’ సీఎంఆర్ రీసెర్చర్ ఆనంద్ ప్రియా సింగ్ అన్నారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ మెరుగైన అవకాశాల పట్ల ఆశాజనకంగా ఉన్నామని ఆనంద్ ప్రియా సింగ్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 18 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ భారత మొబైల్ మార్కెట్లో కొనసాగుతోందని, షియోమి 28 శాతం మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని నివేదిక తెలిపింది. 2021లో మార్చి నాటికి మూడు నెలల్లో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 23 శాతం పెరిగాయి. ఇందులో 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు బలమైన డిమాండ్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed