WHO రిక్వెస్ట్.. ఉత్తర కొరియాకు భారత్ సాయం.!

by vinod kumar |
WHO రిక్వెస్ట్.. ఉత్తర కొరియాకు భారత్ సాయం.!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఉత్తరకొరియా దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఆ దేశంలో టీబీ వ్యాధి ఔషధాల కొరత భారీగా ఏర్పడింది. దీంతో నార్త్ కొరియాకు మెడిసిన్ పంపించాలని డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఇండియాను అభ్యర్థించింది. డబ్ల్యూహెచ్ఓ అభ్యర్థన మేరకు మన దేశం ఔషధాలను సరఫరా చేయడానికి అంగీకారం తెలిపింది. సుమారు మిలియన్ డాలర్ల ( రూ. ఏడున్నర కోట్ల) విలువైన టీబీ మందులను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ కోరిక మేరకు టీబీ ఔషధాలను పంపించేందుకు సాయం చేస్తామని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed