భవిష్యత్తులో బయోపిక్ అంటూ తీస్తే ఆ హీరో జీవిత కథనే తెరకెక్కిస్తాను.. డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
భవిష్యత్తులో బయోపిక్ అంటూ తీస్తే ఆ హీరో జీవిత కథనే తెరకెక్కిస్తాను.. డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన ‘జెంటిల్ మాన్’, ‘ప్రేమికుడు’, ‘జీన్స్’, ‘నాయక్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ: ది బాస్’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘భారతీయుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక రీసెంట్ ‘భారతీయుడు-2’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ మూవీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే రజనీ కాంత్ బయోపిక్‌నే తీస్తాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story