కొత్త కేసులు @96,982

by vinod kumar |
కొత్త కేసులు @96,982
X

న్యూఢిల్లీ: దేశంలో కొత్త కేసుల సంఖ్య తొలిసారిగా లక్ష దాటిన తర్వాతి రోజూ దాదాపు అదే స్థాయిలో నమోదయ్యాయి. కొత్తగా 96,982 కేసులు నమోదయ్యాయి. 446 మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజు 1.03లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049కు, మొత్తం మరణాలు 1,65,547కు చేరాయి. కాగా, యాక్టివ్ కేసులూ కలవరపెడుతున్నాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,88,223కు పెరిగాయి. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా 8,31,10,926 డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది.



Next Story

Most Viewed