చైనా దిగుమతులపై సుంకాలు పెంపు?

by Harish |
చైనా దిగుమతులపై సుంకాలు పెంపు?
X

దిశ, సెంట్రల్ డెస్క్: చైనా నుంచి మన దేశానికి దిగుమతులను వీలైనంత తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు, అధిక సుంకాలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా ఉత్పత్తి చేయగలిగే వస్తువులను దిగుమతి చేసుకోకుండా ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 370 ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిపై కఠినమైన నాణ్యతా ప్రమాణాలు ఖరారు చేస్తోంది. వీటిలో రసాయనాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, ఫర్నీచర్, కాగితం, పారిశ్రామిక యంత్రాలు, రబ్బరు వ్యాసాలు, గాజు పాదార్థాలు, లోహ వస్తువులు, ఫార్మా, ఎరువులు, ప్లాస్టిక్ బొమ్మల వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే, పలు ఇతర ఉత్పత్తులపై దిగుమతుల సుంకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏసీలు, ఆటో పరికరాలు, ఫర్నీచర్‌లపై దిగుమతి సుంకాలను పెంచడానికి కేంద్రం యోచిస్తోంది. స్థానిక తయారీ ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక స్పందన రాలేదు.

Advertisement

Next Story

Most Viewed