ప్రెడెటర్-బి డ్రోన్ల పై భారత్ ఆసక్తి

by Anukaran |   ( Updated:2020-07-06 22:43:45.0  )
ప్రెడెటర్-బి డ్రోన్ల పై భారత్ ఆసక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశాలతో అపాయం పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ భారీగా ఆధునాతన ఆయుధాలు సమీకరించుకుంటోంది. అందులో భాగమే రాఫెల్, సుఖోయ్, మిగ్-29, స్పైస్ -2000మిస్సైల్స్ కొనుగోలు. అంతేకాకుండా ప్రస్తుత ఏయిర్ క్రాప్టులను సైతం ఆప్డేట్ చేయిస్తోంది. ఈ క్రమంలో మన ఆర్మీ కన్ను మేడిన్ అమెరికా అయిన ప్రెడెటర్-బి డ్రోన్లపై పడింది. ఎందుకనగా.. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ చైనాతో ఆయుధ ఒప్పందాలు చేసుకుంటోంది. గతంలో అమెరికా నుంచి ఎక్కువ ఆయుధాలు పొందిన పాక్..ఇప్పుడు చైనా నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటోంది. చైనా మేడ్ వింగ్ లూంగ్-2ను పాక్ కొనుగోలు చేసింది. వీటిని పాక్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. అప్పుడప్పుడు భారత సరిహద్దుల్లో కలకలం సృష్టించే దొంగ డ్రోన్లు ఇవే కావడం గమనార్హం. అయితే, ఇలాంటి డ్రోన్లకు దీటైన డ్రోన్లను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అమెరికా తయారుచేస్తున్న ప్రెడేటర్-బి డ్రోన్లు భారత సాయుధ బలగాలను బాగా ఆకర్షిస్తున్నాయి.
ఈ డ్రోన్లు నిఘా అవసరాల కోసమే కాదు, అవసరమైతే దాడులు కూడా చేయగలవు. వీటికి మిస్సైళ్లు, లేజర్ గైడెడ్ బాంబులు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంతేకాదు, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా యుద్ధ రంగాల్లో సమర్థంగా పనిచేసిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా భారత్ కొనుగోలు జాబితాలో ఉన్నాయి. ఇవి కూడా సాయుధ డ్రోన్లే. ఇటీవలి కాలంలో ఇటు దయాది పాక్ తోనూ, అటు చైనాతో సరిహద్దుల్లో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు కొత్తగా సమస్యలు ఏర్పడుతుండటంతో భారత్ అధునాతన రక్షణ వ్యవస్థలను సమకూర్చుకుంటూ ప్రత్యర్థులకు దీటైన బదులిస్తోంది.

Advertisement

Next Story