- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలో నిరాశ్రయమైన 80 మిలియన్ కుక్కలు, పిల్లులు
దిశ, ఫీచర్స్: ఇటీవలి కాలంలో కుక్కలను, పిల్లులను పెంచుకునే ట్రెండ్ బాగా పెరిగింది. అయితే ఇదే సమయంలో జంతు ప్రేమికులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే.. భారతదేశంలో 80 మిలియన్ పిల్లులు, కుక్కలు నిరాశ్రయులైనట్లు ప్రపంచ సర్వే అంచనా వేసింది. తొమ్మిది దేశాల్లో పెట్ హోమ్‌లెస్‌నెస్‌పై ప్రముఖ జంతు సంక్షేమ నిపుణుల సలహా మండలితో కలిసి ‘మార్స్ పెట్‌కేర్ ఇండియా’ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన సర్వేలో భారత్‌కు 2.4 ఇండెక్స్ ర్యాంకింగ్ లభించగా, జర్మనీ 8.6 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది. UK 7.0తో రెండో స్థానంలో ఉండగా, US 10 పాయింట్స్ స్కేల్‌పై 6.4స్కోర్‌తో నిలిచింది.
సర్వే ప్రకారం జనాభాలో 68 శాతం మంది కనీసం వారానికి ఒకసారి వీధి పిల్లిని (ప్రపంచ సగటు 43 శాతం), 77 శాతం మంది వీధి కుక్కను (ప్రపంచ సగటు 41 శాతం) చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే భారతదేశంలో 9.1 మిలియన్ వీధి పిల్లులున్నాయని, 62 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్లు అంచనా వేసింది.
కొవిడ్-19 మహమ్మారి కాలంలో పెట్-ఓనర్‌షిప్ పెరిగినప్పటికీ.. అదే సమయంలో గృహ, ఆర్థిక పరిమితులు, ఆచరణాత్మక అడ్డంకులు, పెంపుడు జంతువుల పట్ల అవగాహన లేకపోవడం వంటి వాస్తవిక పరిస్థితుల వల్ల చాలామంది యానిమల్ షెల్టర్స్ నుంచి కాకుండా బ్రీడ్ డాగ్స్, క్యాట్స్‌ను అడాప్ట్ చేసుకునేందుకు మక్కువ చూపడం వల్ల వాటి సంఖ్య అంతకంతకు రెట్టింపు అయినట్లు సర్వే వెల్లడించింది.
పెంపుడు జంతువులు నిరాశ్రయులైన కారణాలను గుర్తించేందుకు ‘ఆల్ పెట్స్ వాంటెడ్’ (పెట్స్ పాపులేషన్, రెస్పాన్సిబుల్ బ్రీడింగ్ అధ్యయనం చేయడం ), ‘ఆల్ పెట్స్ కేర్ ఫర్’(పెంపుడు జంతువుల దత్తత రేట్ల స్టడీ) ‘ఆల్ పెట్స్ వెల్‌కమ్’(పెంపుడు జంతువుల యాజమాన్యం అడ్డంకులు, విధానాలపై స్టడీ )వంటి మూడు విభాగాలుగా డేటాను కలెక్ట్ చేసింది. ఈ మేరకు యజమానుల్లో సగం మంది (50 శాతం) గతంలో తమ పెంపుడు జంతువును విడిచిపెట్టినట్లు పేర్కొనగా.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం లో వదులుకునే స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ఇండియాలో 34 శాతం మంది వీధుల్లో కుక్కను వదిలేశారని, 32 శాతం మంది పిల్లిని విడిచిపెట్టారని సర్వే పేర్కొంది. ఈ సర్వేలో మెక్సికో (3.9), దక్షిణాఫ్రికా (4.0), చైనా (4.8), రష్యా (5.2), గ్రీస్ (5.4) వంటి దేశాల కంటే ఇండియా తక్కువ స్కోరు సాధించింది.